దేవరకొండ ఆగష్టు 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక పత్రిక విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విలేకరుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అర్హత కలిగిన విలేకరులకు ఇండ్ల స్థలాలు మరియు ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులు త్వరితగతిన జరిగేలా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న అర్హులైన ప్రజలకు సంక్షేమం అందేలా ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మీడియా వహించాలి అని కోరారు. అదేవిధంగా, అతిత్వరలో దేవరకొండలో ప్రెస్ సంఘ భవనాన్ని నిర్మిస్తామని ఎమ్మెల్యే బాలు నాయక్ హామీ ఇచ్చారు.
శాసనసభ్యులు సమాజంలో విలేకరు వృత్తి గొప్పతనాన్ని వర్ణిస్తూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధానం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


