నస్పూర్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు సిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్ కమిషనర్ సంబంధిత స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి రికార్డ్ లను పరిశీలించారు.
పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకొన్నారు. రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు సిపి వెంట మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపీఎస్., మంచిర్యాల ఏసిపి ఆర్ ప్రకాష్ మంచిర్యాల రూరల్ సీఐ అశోక్ కుమార్ సిసిసి నస్పూర్ ఎస్ఐ ఉపేందర్ ఉన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


