MLA Balu Naik : పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని కొండ భీమన పల్లి గ్రామంలో 50 లక్షల రూపాయల వ్యక్ నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే బాలు నాయక్ శంకు స్థాపన చేశారు. అనంతరం గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్న తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తానని అన్నారు.
సంక్షేమం మరియు అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శనమని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటానని, ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాపతి నిధులు వివిధ అనుబంధ సంఘాల వివిధ హోదాలో ఉన్న నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA laid the foundation stone

You cannot copy content of this page

Scroll to Top