జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 20 at 6.00.05 PM

TRINETHRAM NEWS

అడుదాం ఆంధ్ర మండల స్థాయి విజేతలకు బహుమతుల ప్రధానం.

వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండల కేంద్రం అయిన శావల్యాపురం గ్రామం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, మండల స్థాయి లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేసిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు

ముందుగా క్రీడాకారులను ఆప్యాయంగా పలకరించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, దేశం లోనే మెట్టమెదటిసారి ఆటల పండుగను తీసుకొచ్చిన ప్రభుత్వం వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలిపారు. యువత ఆటల్లో రానించే విధంగా వారికి ప్రభుత్వం తరపున ఇలాంటి పోటిల ద్వారా వారి లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఆటల వలన శరీర వ్యాయామం కలిగి అరోగ్యం మెరుగుపడేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మట్టిలోని మానిక్యాలను వెలికి తీసి క్రీడల్లో ప్రపంచ స్థాయి కి ఎదిగేందుకు వీలు కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారితో పాటు గా సంభంధిత శాఖ అధికారులు, నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page