పట్టు రైతులను రీలర్లును వెంటనే ఆదుకోవాలి- మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

TRINETHRAM NEWS

పట్టు రైతులను రీలర్లును వెంటనే ఆదుకోవాలి- మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణ కేంద్రంలో గత కొన్ని రోజుల నుండీ పట్టు రైతులకు ఇవ్వాల్సిన ఇన్సెంటీవ్‌ను వెంటనే విడుదల చేసి, రైతులను ఆదుకోవాలని మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండు మల తిప్పేస్వామి డిమాండ్ చేస్తు పట్టు రైతులు చేస్తున్న దీక్ష సంగీబావం తెలిపి మద్దతు తెలిపారు . ఈ కార్యక్రమంలో మాట్లాడుతు పట్టు రైతులకు ఇన్సెంటీవ్‌ను వెంటనే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తు శనివారం పట్టు గూళ్ల మార్కెట్‌ ముందు పట్టు రైతు సంఘం ఆద్వర్యంలో పట్టు రైతులు ఆందోళన చేపట్టారు. 2019 నుంచి ఇప్పటివరకు హిందూపురం పట్టుగూళ్ల మార్కెట్‌కు సంబంధించి రూ.60కోట్లు బకాయిలు రావాల్సి ఉందన్నారు. ఇప్పటివరకు 12 సార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను వివరించామన్నారు. 15 రోజుల్లో బకాయిలను విడుదల చేస్తామని చెప్పి నాలుగున్నర సంవత్సరం గడుస్తున్నా మూడు రూపాయిలు కూడా విడుదల చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఈ సందర్బంగా పట్టు రైతు సంఘం రాష్ట్ర నాయకులు ధనాపురం వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బేవినహల్లి ఆనంద్, రైతు సంఘం అధ్యక్షుడు సోము పట్టు రైతులు పాల్గోన్నారు.

You cannot copy content of this page

Scroll to Top