MLA Balu Naik : ఎం కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎం ఎల్ ఏ.

TRINETHRAM NEWS

దేవరకొండ ఆగష్టు 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఎం కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులతో కలిసి దేవరకొండ ఎం ఎల్ ఏ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే దృఢసంకల్పంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. సకాలంలో ప్రహరీ గోడ నిర్మాణం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLA laid the foundation stone

You cannot copy content of this page

Scroll to Top