Foundation Stone Laying Ceremony : ఘనంగా శిఖరం నిర్మాణ శంకుస్థాపన

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఆగస్టు 18 : కూకట్పల్లి దీనబంధు కాలనీలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి గుడి గోపుర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ప్రముఖ యాగ్నికులు శ్రీహరి ఆచార్యుల చేతుల మీదుగా వేదమంత్రోచ్చారణల నడుమ, శాస్త్రోక్త పద్ధతిలో శంకుస్థాపన కార్య క్రమం నిర్వహించబడింది.ఈ సందర్భంగా కాలనీ వాసులు, సంఘ అధ్యక్షుడు మహేందర్ నాయక్, కోశాధికారి ఆవుల రాజు, గిరి, మోహన్ రావు, వెంకటేశ్వర శెట్టి, బాలు, వెంకటయ్య, గణేష్, బసవరాజు, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, కనకరాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శంకుస్థాపన వేడుకలను విజయవంతం చేశారు.గోపుర నిర్మాణ ప్రారంభం భక్తులకు ఆనందాన్ని కలిగించిందని, ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలనే అభిప్రాయం వ్యక్తమైంది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand foundation stone laying ceremony

You cannot copy content of this page

Scroll to Top