Supreme Court : సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌, ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాను.తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ వ్యతిరేకించడం మరియు ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌ లను నియమించడాన్ని సవాల్ చేస్తూ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్‌ పిటిషన్ దాఖలు చేయడంతో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ప్రొఫెసర్ కోదండరాం, అలీఖాన్‌ల నియామకం రద్దు చేస్తూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.
గతంలో కూడా దాసోజు శ్రవణ్ ఒక ఉద్యమ నేతగా సహచర ఉద్యమకారుడికి అన్యాయం చేయొద్దంటూ కోదండరామ్‌ కు సైతం లేఖ రాశారు. న్యాయం కోసం గవర్నర్ నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన ఆయనకు అనుకూలంగా తీర్పు రావడం సంతోషాన్నిచ్చింది.చివరకు న్యాయమే గెలిచింది. సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిది, సుప్రీం తీర్పుతోనైనా రేవంత్‌ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం జరగాలని ఆశిస్తున్నాను.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Supreme Court verdict

You cannot copy content of this page

Scroll to Top