రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం కార్పొరేషన్ పరిధి ఫర్టిలైజర్ సిటీలోని ఎల్కలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో క్రీడా యూనిఫాంలు 100 మంది విద్యార్థులకు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎల్లప్ప, కార్యదర్శి సారయ్య, ట్రెజరర్ రాజేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీనియర్ సభ్యులు లయన్ గంగాధర్ సూచనలతో సీనియర్ సభ్యులు పీడీజీ లయన్ సు.వి తపాడియా గ సహకారంతో విద్యార్థులకు యూనిఫామ్ లు అందజేయడం జరిగిందని అన్నారు అలాగే మంచి విద్యను అభ్యసించి సమాజానికి సేవ చేయాలని పలువురు సూచించారు. ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ రాజేందర్, జీఎంట్ కో ఆర్డినేటర్ రామస్వామి, అలాగే క్లబ్ సభ్యులు గుండా రాజు, సత్యనారాయణ, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


