దేవరకొండ ఆగష్టు 08 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని ఆర్డిఓ ఆఫీసులో నిర్వహించిన ఇందిరమ్మ ఇండ్ల రివ్యూ మీటింగ్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,RDO రమణా రెడ్డి మరియు హౌసింగ్ అధికారులు, నియోజకవర్గానికి సంబంధించిన అన్ని మండలాల ఎంపీడీవోలు, తహసీల్దార్లు మరియు సంబధిత సిబ్బందితో కలిసి స్థానిక ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో కొన్ని అంశాలు.. సాంకేతిక కారణాలతో ఇంకా పెండింగ్లలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు త్వరగా పూర్తిచేయాలని చేయాలని ఆదేశించారు. దశలవారీగా పూర్తయిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వెంటనే వారి ఖాతాలలో డబ్బులు జమ కావాలని అన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అధికారులు సహకరించాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.లబ్ధిదారుల ఇండ్లు త్వరగా పూర్తి చేసే బాధ్యత మీదేనని అధికారుల సమీక్షలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ పైవిధంగా పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


