KTR : కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల మహిళలు

TRINETHRAM NEWS

మహిళల వ్యాఖ్యలు…

ప్రభుత్వం మా భూములు గుంజుకొని మా భర్తను జైలుకు పంపి అన్ని వైపులా దాడులు చేస్తుంటే కేటీఆర్ అన్న లెక్క నిలబడ్డాడు

నిండు గర్భిణిగా ఉన్న నా యొక్క క్షేమాలన్నీ చూసుకున్నాడు

నా బిడ్డకు మేనమామ లెక్క భూమి నాయక్ అని పేరు పెట్టిండు

కేటీఆర్ నాకు దేవుడు ఇచ్చిన అన్న అని తెలిపిన లగచర్ల ఆడబిడ్డ జ్యోతి

Trinethram News : రాష్ట్రంలో ఆపదలో ఉన్న ఆడబిడ్డలు అందరికీ కేటీఆర్ ఒక అన్నగా నిలబడుతున్నాడు అని తెలిపిన గిరిజన సోదరీమణులు

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కొడంగల్ నుండి వచ్చిన గిరిజన సోదరీమణులు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు, తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు ఈ రాఖీ కట్టామని వారు తెలిపారు.

కొడంగల్ మండలం, లగచర్ల గ్రామం, రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొంతమంది మహిళలు ఈరోజు కేటీఆర్ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన, సమయంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితో పాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని ఢిల్లీ వేదికగా ఎండగట్టారు. దీని ఫలితంగా, ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలుపాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్ అన్నగా అండగా నిలబడి, న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు.

రాఖీ కట్టిన సందర్భంగా జ్యోతి తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. “ప్రభుత్వం మా భూములు లాక్కొని అన్ని వైపుల నుంచి దాడులు చేసి, మా కుటుంబ సభ్యులను జైల్లో పెడితే, నిండు గర్భిణిగా ఉన్న నాకు కేటీఆర్ అన్న అండగా నిలబడ్డారు. దగ్గరుండి నా బాగోగులు చూసుకున్నారు. నా ఆరోగ్యంతో పాటు నా ప్రసవం వరకు, నా బిడ్డ ‘భూమి నాయక్’ యోగక్షేమాల కోసం ఒక సొంత సోదరుడిలా అన్ని బాధ్యతలు తీసుకున్నారు” అని జ్యోతి కన్నీళ్లు పెట్టుకున్నారు. కేటీఆర్ మేనమామలా తన బిడ్డకు పేరు పెట్టారని జ్యోతి సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ తనకు దేవుడు ఇచ్చిన సోదరుడని ఆమె అన్నారు. కేవలం తమకు మాత్రమే కాకుండా, రాష్ట్రంలో ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆయన అన్నలా ఆదుకుంటారని, అలాంటి కేటీఆర్‌కు, ఈరోజు ఆయన ఇంటికి వచ్చి రాఖీ కట్టడం తమకు చాలా సంతోషంగా ఉందని జ్యోతి తెలిపింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Women of Lagacharla tied Rakhi

You cannot copy content of this page

Scroll to Top