డిండి (గుండ్లపల్లి)ఆగస్టు 07 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామపంచాయతీ వడ్డెర గూడెం లో కొలువైన ఈదమ్మ తల్లి మాంధాత దేవతల అభిషేకం పూజా కార్యక్రమం గురువారము రోజు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు పొందారు .ఈ పూజా కార్యక్రమంలో పిల్లలు గ్రామ పెద్దలు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి గ్రామ శాఖ అధ్యక్షుడుఓర్సు ముత్యాలు మాట్లాడుతూ ఆ తల్లి చల్లని చూపు గ్రామ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరారు, ఏ కరువు లేకుండా పంటలు సమృద్ధిగా పండేవిధంగా ,ప్రజలు సుఖ శాంతులతో వర్ధిల్లేటట్లు చూడాలని దేవతలను వేడుకున్నారు.ఈ పూజ కార్యక్రమములో అంజయ్య మాజీ ఎంపీటీసీ భత్తుల శీను మాజీ సర్పంచ్ వెంకటయ్య లక్ష్మీనారాయణ వెంకటేష్ వెంకటయ్య శీను అంజయ్య జగన్ రమేష్ సహదేవ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


