Vegulla Leela Krishna : జనవాణి నిర్వహించిన, వేగుళ్ల లీలా కృష్ణ, ప్రజల వద్ద అర్జీలు స్వీకరణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, ఆదేశాలు మేరకు మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన జనవాణిలో పలువురు తమ సమస్యలను తెలియచేశారు. వీరి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వేగుళ్ళ లీలాకృష్ణ, అర్జీలు స్వీకరించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు చెప్పిన సమస్యలను ఆయన నమోదు చేసుకున్నారు. తక్షణ పరిష్కారం కొరకు సమస్యలను వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు శ్రీ అక్కల గాంధీ, శ్రీమతి పి.శివ పార్వతి, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ బి. అశోక్ కుమార్ పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Janavani organized, Vegulla Leela Krishna,

You cannot copy content of this page

Scroll to Top