నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ .
దేవరకొండ (కొండ మల్లేపల్లి) ఆగష్టు06 త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి మండలం గౌరికుంట తండాలో వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రారంభోత్సవం కార్యక్రమంలో నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని ప్రత్యేకపూజలునిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలమర్చుకోవాలని అని ఆయన అన్నారు.అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ రైతు బంధు అధ్యక్షులు కేసాని లింగా రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు రమావత్ తులిసిరం, మాజీ సర్పంచ్ రమావత్ దీప్ల నాయక్,రమావత్ రమేష్,రమావత్ కృష్ణ,పెద్దిశెట్టి సత్యం, వెంకటయ్య,శివ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


