ముఖ్య అతిధిగా పాల్గొన్న బ్రహ్మకుమారీస్ ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ బికె రజని
అనపర్తి, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రక్షా బంధన్ అనేది సోదరుల మధ్య మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక దృక్పథంతో ఉంటూ దేవునితో మనకు గల శాశ్వతమైన సంబంధాన్ని గుర్తు చేస్తుందని బ్రహ్మకుమారీస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఇంచార్జ్ బికె రజని అన్నారు. అనపర్తిలో గల బ్రహ్మకుమారీస్ తపస్యధామ్ ఆశ్రమంలో గురువారం రక్షా బంధన్ వేడుకలు నిర్వహించారు. స్థానిక కేంద్ర నిర్వాహకురాలు బికె సుశీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జ్ బికె రజని ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ, మానవులు అసలు స్వభావం అయిన శాంతి, ప్రేమ, స్వచ్ఛత, జ్ఞానం, దయలో ఉండటానికి ప్రతిజ్ఞ చేయాలనీ, తద్వారా మన ప్రతి ఆలోచన, మాట , చర్య ఉన్నతమైనదిగా , దివ్యమైనదిగా మారుతుందన్నారు.
బ్రహ్మబాబా మురళి పాఠాలు మనకు దైవిక జ్ఞానాన్ని ప్రసాదించి, అపరిమితమైన శాంతి , ఆనందాన్ని కలుగజేస్తాయని అన్నారు. రక్షాబంధన్ అనేది మన స్వీయ పరివర్తనకు రుజువుగా ఉండాలని, రాఖీని కట్టేటప్పుడు మన వ్యర్థ ఆలోచనలు, మాటలు త్యజించి మన బంధాన్ని ఉన్నతమైనదివిగా మార్చే విధంగా ఉండేలా మం ఆలోచనలు ఉండాలని ఆమె సూచించారు. అదేవిధంగా రాఖి పండుగ ప్రాముఖ్యత, సమాజ శాంతి, సర్వమానవ శ్రేయస్సు , మనసుని ధ్యానం, యోగం వైపు మళ్లించే విధంగా తీసుకోవాల్సిన చర్యలు పై బికె రజని ఉపన్యసించారు. అనంతరం పలువురు ప్రముఖులు కు బాబా రక్షాబంధనాన్ని ధరింపజేశారు. ఈ కార్యక్రమంలో దేవారెడ్డి, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


