Rare Surgery : రమాదేవి హాస్పిటల్ లో చిన్నారికి అరుదైన శస్త్ర చికిత్స

TRINETHRAM NEWS

అనపర్తి. త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తిలో గల రమాదేవి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ ఎన్ టి వైద్యులు ఒక చిన్నారికి అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యురాలు ఎమ్ . రమాదేవి తెలిపారు. రంగంపేట మండలం అచ్యుతాపురం గ్రామానికి చెందిన 3 ఏళ్ళ చిన్నారి గత కొన్ని రోజులుగా జలుబుతో పాటు ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతోందని, అదేవిధంగా ఎడమ ముక్కు నుండి చీము కారడం వంటి సమస్యలతో రమాదేవి హాస్పిటల్‌ లో వైద్యులను సంప్రదించారు. డాక్టర్ రమాదేవి సూచనలు మేరకు చెవి, ముక్కు, గొంతు ( ఈ ఎన్ టి ) విభాగ నిపుణులు డా. భార్గవ్ ఫణికృష్ణ పాపను పరీక్షించి, ముక్కులో మొక్క కాడ (పొడి గడ్డి) ఇరుక్కుపోయి ఇన్ఫెక్షన్ ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే అత్యాధునిక ఎండోస్కోపిక్ సర్జరీ విధానంలో పాపకు పూర్తి మత్తు ఇచ్చి మొక్క కాడను విజయవంతంగా తొలగించారు.
చికిత్స అనంతరం పాప ఆరోగ్యం మెరుగుపడటంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు హాస్పిటల్ వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rare surgery performed

You cannot copy content of this page

Scroll to Top