దేవరకొండ నియోజక వర్గంలో 11736 కొత్త రేషన్ కార్డులు జారీ.
ఎం ఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ – .(పి ఎ పల్లి)జులై. 31 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని పి ఏ పల్లి మండలం లోని అంగడిపేట x రోడ్డు వైష్ణవి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన ఆహార భద్రత కార్డులు మంజూరు పత్రాలను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈసందర్భంగా ఎం ఎల్ ఏ మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక భరోసా వడ్డీ లేని రుణాలు. గూడు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్, 10 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, రైతు భరోసా , ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల పట్ల నిబద్ధతతో ముందుకు సాగుతున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు ,మండల నాయకులు, యువజన నాయకులు ,మహిళలు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


