31 జులై .2025. త్రినేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. దమ్మపేట మండలంలో పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. మల్కారం గ్రామంలో రావూరి సాయికుమార్ చే నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ హను రక్త పరీక్షా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేసి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం మందలపల్లి గ్రామంలో దారా రంగారావు, మనవడు మేఘన బాబు అనారోగ్యంతో మరణించగా వారి భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అంకంపాలెం గ్రామంలో బైట కన్నమ్మ, అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ దమ్మపేట మండల అధ్యక్షులు కాకా రమేష్ జిల్లా దిశ కమిటీ సభ్యురాలు సొంగ ఏసుమణి, మండల నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


