MLA Jare : అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముఖాముఖి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్జు 31 లై.2025. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం అచ్యుతాపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. విద్యార్థులతో నేరుగా ముఖాముఖి అయి వారి విద్యాసామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. పలువురు విద్యార్థుల చేత పాఠశాల బోర్డుపై ఇంగ్లీష్ పదాలను రాయించి విద్యార్థులకు పాఠశాల ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి బాల బాలికలతో ముచ్చటించారు. వారితో నేలపై కూర్చుని అక్షరాలు దిద్దించారు. అలాగే విద్యార్థులకు అందిస్తున్న ఆహారం వంటసరుకులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mla jare : Primary School students

You cannot copy content of this page

Scroll to Top