Chalo Delhi : బీసీ కోటా కోసం ఛలో డిల్లీ

TRINETHRAM NEWS

-బీసీ లకు 42శాతం రిజర్వేషన్ వచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు.
ఎం ఎల్ ఏ బాలు నాయక్.
దేవరకొండ -(కొండ మల్లేపల్లి) జులై 31 త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి లో ఏర్పాటు చేసిన ప్రింట్ అండ్ మీడియా ప్రతినిధి లతో కలిసి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ ప్రెస్ మీట్ నిర్వహించారు. రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు స్థానిక సంస్థల్లో, విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయబడింది. ఆ తీర్మానం గవర్నర్ ర్ రాష్ట్రపతి కి పంపారు. ఇప్పుడు కేంద్రం బాధ్యతగా వ్యవహరించి వెంటనే ఆమోదించాలి అని అన్నారు.
బలహీనవర్గాలపై నిజమైన ప్రేమ ఉంటే కేంద్ర బిజెపి ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ బిల్లును తక్షణమే ఆమోదించాలని ఈ బిల్లును ఆమోదించాలన్న డిమాండ్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో సహా యావత్ క్యాబినెట్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలిపారు. 42 శాతం బీసీ కోటా బిల్లుల ఆమోదంలో జరుగుతున్న జాప్యం పై నిరసన తెలిపేందుకు తొలత 5న పార్లమెంటును పార్టీ ఎంపీల ద్వారా వాయిదా తీర్మానం ఇయ్యబోతున్నట్లు తెలిపారు.
ఏడున సీఎంతో పాటు మంత్రులు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల నాయకులు, దాదాపు 200 మంది ప్రజాప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి వినతి పత్రం అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ పత్రికా సమావేశంలో ప్రజా ప్రతినిధులు మండల ముఖ్య నాయకులు యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chalo Delhi for BC quota

You cannot copy content of this page

Scroll to Top