వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ఆదేశాల మేరకు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కే గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన, వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు 18వార్డు అంబేద్కర్ కాలనీ రామాయగూడ, 19 వార్డు రామయ్య గూడ గృహకల్ప, 20వార్డు అనంతగిరిపల్లి, గృహకల్ప వార్డులకు సంబందించిన బి ఆర్ యస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, వార్డు కమిటీల ఎంపిక, అనుబంధ కమిటీల ఎంపిక, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయం, విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో వికారాబాద్ సీనియర్, నాయకులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ , మాజీ కౌన్సిలర్ అనంతరెడ్డి , మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ మార్కెట్,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి , కార్యనిర్వాహక అధ్యక్షులు సుభాన్ రెడ్డి, తెలంగాణ ఉద్యమకారులు మంచనపల్లి సురేష్ ,జనరల్ సెక్రటరీ గాండ్ల మల్లికార్జున్ , తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


