Collector Koya : కేజీబీవి అభివృద్ధి పనులను పటిష్టంగా చేపట్టాలి జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

అంతర్గాం మండలం ఎల్లంపల్లి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ

అంతర్గాం , జూలై-30: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అంతర్గాం మండలం ఎల్లంపల్లి గ్రామంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేజీబీవీ లోని డార్మెంటరీ, బాలికల టాయిలెట్స్, కిచెన్ రూమ్ తరగతి గదులను కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ,  కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

కేజీబీవీ లో డ్రైనేజీ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పిస్తే నిధులు మంజూరు చేస్తానని కలెక్టర్ పేర్కొన్నారు. కేజీబీవీ కు రెండు వైపులా హై మాస్ లైట్ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట పి.ఆర్. డీఈ అప్పల్ నాయుడు, ఏఈ రాజ్ కుమార్, కేజీబీవీ ఎస్. ఓ. కల్పన, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector should take

You cannot copy content of this page

Scroll to Top