Collector Koya : మహిళలకు నెల నెలా ఆదాయం లభించేలా మార్కెట్ సుస్థిరం చేసుకోవాలి

TRINETHRAM NEWS

డి.ఆర్.డి.ఏ కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కోయ,హర్ష

పెద్దపల్లి, జూలై -03: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో డి.ఆర్.డి.ఏ కార్యాలయాన్ని సందర్శించారు రిజెన్ ఆర్ట్స్ శిక్షణ పోందిన మహిళలు ఎటువంటి యంత్రాల సాయం లేకుండా చేతితో తయారు చేసిన వస్తువులను కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య పెద్దపల్లి ఆధ్వర్యంలో వివిధ స్వశక్తి సంఘాలకు చెందిన 30 మందికి మహిళలు రెజిన్ ఆర్ట్స్ లో శిక్షణ అందించడం జరిగిందని అన్నారు రెజిన్ ఆర్ట్స్ శిక్షణ నేర్చుకున్న మహిళలు ఆర్టికల్స్ తయారు చేసి నెల నెలా ఆదాయం పొందేలా మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం. కాళిందిని , అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, డి.పి.ఎం.లు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Market should be stabilized

You cannot copy content of this page

Scroll to Top