MLA Nenavath Balu Naik : కాంగ్రెస్ హయాంలోనే రైతాంగానికి సమృద్ధిగా సాగు జలాలు

TRINETHRAM NEWS

చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తా.
ప్రతినిరుపేదకుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు.
ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్
డిండి (గుండ్లపల్లి) జులై 30 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని వీ ఏ ఎస్ . ఫంక్షన్ హాల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను అధికారులు,స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ బాలు నాయక్ పంపిణీ చేశారు.డిండి రిజర్వాయర్ నుండి ఆయకట్టుకు సాగునీరు రైతులతో కలిసి విడుదల చేయడం జరిగింది. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, మోడల్ స్కూల్ మరియు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…. 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు పంపిణీ చేసి, కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు అని, దేవరకొండనియోజకవర్గంలోనే కొత్తగా 11736 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం సంతోషించదగిన అంశమని,ప్రతి ఎకరా కు సాగునీరు అందిస్తామని అన్నారు.చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది డిండి రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు సకాలంలో సాగు నీటిని అందిస్తున్నామన్నారు. రైతులు సమన్వయంతో వ్యవహరిస్తూ సాగు నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణం కొనసాగుతుందనీ తెలిపారు.
రెసిడెన్షియల్ స్కూల్‌లలో డైట్ ఛార్జీలను 40% పెంచి ఉత్తమ పోషణ మెనూను అమలుచేస్తున్నామనిఅన్నా రు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు, ,మండల పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు ,మహిళలుతదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Abundant irrigation water for

You cannot copy content of this page

Scroll to Top