(హుకుంపేట) అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ జూలై 30. అల్లూరి జిల్లా హుకుంపేట మండలం ఓల్డా పంచాయతీ పూసలగురువు, ఉప్ప గ్రామాల్లో అక్రమ సారా వ్యాపారాలపై పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. సీఐ సన్యాసినాయుడు నేతృత్వంలో సివిల్, ఎక్సైజ్ విభాగాలు సంయుక్తంగా చేపట్టిన దాడుల్లో 150 లీటర్లు సారా స్వాధీనం, 6000 లీటర్ల పులుపు ధ్వంసమయ్యింది.
దాడుల్లో నల్లబెల్లం, ఇతర సామగ్రిని కూడా గుర్తించి నాశనం చేశారు. గ్రామస్థులు, అధికారుల సహకంతో పారిపోయిన వ్యాపారుల వివరాలు సేకరించామని, త్వరలో వారిని అరెస్ట్ చేస్తామని సీఐ సన్యాసినాయుడు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఎక్సైజ్ సీఐ ఆచార్య, స్థానిక ఎస్సై సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


