వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ ఆదేశాల మేరకు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు కే గోపాల్ ముదిరాజ్ అధ్యక్షతన , వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని వార్డు 7,8,9గుడుపల్లి,చిట్టెంపల్లి, బూర్గుపల్లి వార్డులకు సంబందించిన బి ఆర్ యస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం వికారాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, వార్డు కమిటీల ఎంపిక, అనుబంధ కమిటీల ఎంపిక, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో విజయం, విజయమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.ఈ సమావేశంలో వికారాబాద్ మాజీ కౌన్సిలర్ సీనియర్, నాయకులు అనంత్ రెడ్డి , మాజీ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి , PACS వైస్ చైర్మన్ పాండు , గుడిపల్లి మాజీ కౌన్సిలర్ నర్సింలు , బూరుగుపల్లి అనంత్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి , మల్లికార్జున్ , గుడిపల్లి లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


