తేదీ : 26/07/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిలకలూరిపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఇంచార్జ్ , షేక్ జిలానిని రాధా రంగా మిత్రమండలి జనసేన పార్టీ కార్యదర్శి కార్యదర్శి అచ్చు కోట. మురళీకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను శాలువా తో కప్పి, పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా మురళీకృష్ణ నియోజకవర్గంలో పార్టీ తరపున తను నిర్వహిస్తున్న, నిర్వహించబోతున్న పార్టీ , రాధా రంగా మిత్రమండలి కార్యక్రమాలను తెలియజేశారు. అదేవిధంగా పార్టీని బలోపతం చేయడానికి మురళీకృష్ణ కు తగు సలహాలు, సూచనలు జిలాని సూచించారు. పార్టీపరంగా తన సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మి, జిల్లా టిడిపి కార్యవర్గం కార్యదర్శి, అందెల. సౌరి మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


