Awareness Seminar : ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలి

TRINETHRAM NEWS

వేమగిరిలో బ్యాంకు సేవలపై అవగాహన సదస్సు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కడియం మండలం వేమగిరి లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్స్ ఎడ్యుకేషన్,అవేర్నెస్ ఫండ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సౌజన్యంతో సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మెగా ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జిఎం ఎ. మహాన మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగి ఉండాలని, పి.ఎమ్ జన్ధన్ ఖాతాలు, రూపే ఏటీఎం కార్డు, నామినేషన్ సౌకర్యాలు కలిగి ఉందని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రీజినల్ హెడ్ రత్న కుమారి మాట్లాడుతూ జన సురక్ష కార్యక్రమంలో సామాజిక భద్రతా పథకాలైన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి ,ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన,అటల్ పెన్షన్ యోజన,వాటిలో ప్రతి ఒక్కరు నమోదు చేయించుకోవాలన్నారు.

సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.ఆంజనేయులు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకోవాలని, అలాగే బ్యాంకింగ్ ఆప్స్, క్యూ అర్ కోడ్ వాటి పై ప్రత్యేకమైన అవగాహన కలిగి నగదు రహిత లవాదేవీలు నిర్వహణకు, బ్యాంకింగ్ రుణాలు,భీమా పథకాలు,డిపాజిట్ బ్యాంకింగ్ పథకాల ద్వారా ఏ విధంగా లబ్ధి పొందాలో ఈ ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ డి ఓ నవీన్, యూనియన్ బ్యాంక్ రీజనల్ ఎఫ్ ఐ ఆఫీసర్ గోపాల్,వేమగిరి బ్రాంచ్ మేనేజర్ వంశీ, ఆర్థిక అక్షరాస్యత కేంద్రాల నుండి హరి,అనిల్,చిట్టి తల్లి, జ్యోతి, కడియం ఎపిఎం నాగలక్ష్మి పాల్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

aware of financial literacy

You cannot copy content of this page

Scroll to Top