కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కొత్తపేట: కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. కొత్తపేట మండలం గంటి గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలను, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.
పెరిగిన పింఛన్లు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సైతం ఎమ్మెల్యే బండారు ప్రజలకు వివరించారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు సౌకర్యాలు అమలుకానున్నాయని తెలిపారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


