డిండి (గుండ్ల పల్లి) జులై 24 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వడ్త్య రమేష్ నాయక్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు మార్గదర్శనం కేటీఆర్ అని, తెలంగాణ ఐటీ రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా యువతకు మార్గదర్శనం చేస్తూ, చిరకాలం ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు మరియు పండ్ల పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో డిండి మండలం బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు రాఘవాచారి, బి ఆర్ ఎస్ పార్టీ డిండి పట్టణ అధ్యక్షులు గిరామొని శ్రీను, పున్న లింగమయ్య, బి ఆర్ ఎస్ పార్టీ యువజన నాయకులు రషీద్, గుర్రం సురేష్ నేత, మైనార్టీ నాయకులు పీర్ మహమ్మద్, బాసిద్, జహంగీర్, ఖలీల్ రామస్వామి,జయ వర్ధన్, ఐలేష్ చారి, మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


