డిండి (గుండ్ల పల్లి)జులై 23త్రినేత్రం న్యూస్. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టాక్టర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు డిండి ఎస్ ఐ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు .ఈ కేసుకు సంబంధించి ఎస్ ఐ అందించిన వివరాల ప్రకారం నేడు ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న 3 ఇసుక ట్రాక్టర్లు నంబర్ ఎ. పి. .07 డి. ఈ 2395, టి.యస్ 05 యు బి 8400 మరియు టి ఎస్ 05 యు.
ఈ 7330 టాక్టర్లను పట్టుకొని డ్రైవర్లపై కేసు నమోదు చేసుకొని టాక్టర్లను ట్రాలీలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ ఐ తెలిపారు. ఇట్టి అక్రమ ఇసుక కందుకూరు గ్రామ శివారు, చెరకుపల్లి గ్రామ శివారులో అక్రమ ఇసుక రవాణా జరుగుతుందనే సమాచారము మేరకు డిండి ఎస్ ఐ మరియు సిబ్బంది తో ఆకస్మిక తనిఖీ చేసి అక్రమ ఇసుక రవాణాటాక్టర్ డ్రైవర్లపై కేసు నమోదు చేశామని తెలిపారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


