ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపు
టిడిపి రాష్ట్ర నాయకులు కాశి నవీన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా రెండు వీల్ చైర్లు వితరణ
రాజమహేంద్రవరం : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, సమాజ సేవలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని రాజమహేంద్రవరం సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లిదండ్రులు కాశి రాజారావు, కాశి సరోజిని జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రెండు వీల్ చైర్ లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చేతులు మీదుగా బహూకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మన జీవితంలో జరిగే శుభకార్యాలు సందర్భంగా సమాజానికి ఉపయోగపడేలా మంచి కార్యక్రమాలు చేస్తే కలకాలం నిలిచి ఉంటాయన్నారు.
దానిని గుర్తించిన కాశి నవీన్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రికి ఉపయోగపడేలా రెండు వీల్ చైర్లు బహుకరించడం అభినందనీయమన్నారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ మాట్లాడుతూ తన పుట్టినరోజును పురస్కరించుకొని తన తల్లిదండ్రులు రాజారావు సరోజినీల జ్ఞాపకార్థం వీల్ చైర్ లను ప్రభుత్వ ఆసుపత్రికి అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోరి ముందుకు వస్తే పేదలకు సహకారం అందించినట్టు అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


