ఊట్లపల్లి ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రాంబాబు ఆధ్వర్యంలో శ్రీశ్రీ ముత్యాలమ్మ తల్లి కి చీరా సారీ అందించారు
త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఊట్లపల్లి గ్రామంలో శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి ఆషాడ మాసం సందర్భంగా బోనాలు చీర సారీ నైవేద్యాలతో గ్రామంలోని పెద్దలు మహిళలు పిల్లలు సమక్షంలో సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దాసరి రాంబాబు. మాట్లాడుతూ.కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా పేరొందిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారికి బోనాల జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.అమ్మవారిని దర్శించుకుని బోనాలు. పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
అమ్మకృపతో మండలంలోని. ప్రజలందరూ.సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తులతూగాలని. ఆకాంక్షిస్తున్నామన్నారు. ఊట్లపల్లి గ్రామ పెద్దలు.ప్రజల సహకారంతో.బోనాల జాతర మహోత్సవాలు కనుల పండుగ జరిగాయన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని. అమ్మవారి సేవలో తరించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో. గ్రామ పెద్దలు ప్రజలు. యువకులు.పిల్లలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


