వారం రోజుల్లో రఘుదేవపురం రోడ్డు పనులు ప్రారంభం
ఎంపీ లాడ్స్ క్రింద మంజూరైన కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభించాలి
ఎమ్మెల్యే బత్తుల
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం నియోజకవర్గం లో కీలకరోడ్ల అభివృద్ధికి నిధులు తెచ్చామని, జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలని,రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, అన్నారు. వారం రోజుల్లో రఘుదేవపురం రోడ్డు పనులు ప్రారంభించాలన్నారు. సీతానగరం – పురుషోత్తపట్నం రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలి. ఎన్నో ఏళ్లుగా ఈ రోడ్డు నిర్లక్ష్యంగా వదిలివేశారు.
ఈ రోడ్డు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని వెంటనే పనులు ప్రారంభించాలన్నారు. కోటి, కూనవరం, కోరుకొండ పోలీస్ స్టేషన్ రోడ్డు, గాడాల – పాలచర్ల రోడ్డు పనులు ఆయన సమీక్షించారు. ఎంపీ లాడ్స్ క్రింద మంజూరైన కమ్యూనిటీ హాల్ పనులు ప్రారంభానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ రివ్యూ మీటింగ్ లో అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


