Former Municipal Chairman : శ్రీ విజయ దుర్గ వారిని దర్శించుకున్న మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వర ప్రకాష్

TRINETHRAM NEWS

విజయ దుర్గా దేవి అమ్మవారు శాకంబరి దేవిగా అలంకరణలో భక్తులకు దర్శనం…

మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆషాఢమాసం పురస్కరించుకుని మండపేట రైతు బజారు వద్ద కొలువై ఉన్న శ్రీ విజయ దుర్గ దేవి ఆలయం ను మండపేట మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు, వర ప్రకాష్ విజయ దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రకాష్ కు ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికి వరప్రకాష్ ను సత్కరించారు.

అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఆలయ పూజారి చేయించారు. ఆలయ ప్రాంగణంతోపాటు గర్భాలయం అంతరాలయం వివిధ రకాల కూరగాయలు పండ్లతో పాటు సుగంధ పుష్పాలతో ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ ని అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Municipal Chairman Chundru

You cannot copy content of this page

Scroll to Top