దేవరకొండ జులై 17 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ రాష్ట్ర ఉద్యాన మరియు పట్టు పరిశ్రముల శాఖ వారు ఏర్పాటు చేసిన సూక్మ సేద్యం పరికరాలు ( పైపులు,స్ర్పింక్లర్స్) పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, మంజూరు అయిన 18 మంది లబ్ధిదారులకు 18 సెట్లు సూక్మ సేద్యం పరికరాలు ( పైపులు,స్ర్పింక్లర్స్)లను దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత ప్రజా పాలనలో భాగంగా వ్యవసాయం,విద్య, వైద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. రైతులు స్ప్రింక్లర్ ను సద్వినియోగం చేసుకొని, ఆర్ధికంగా ఎదగాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, మండల ముఖ్య నాయకులు,యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


