Morning Walk : అశ్వారావుపేట లో మార్నింగ్ వాక్ నిర్వహించిన, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ 17.07.2025 – గురువారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం.. రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణం సమాచార మరియు, పౌరసంబంధాల శాఖల మంత్రి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, * స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఐటీడీఏ పీవో, బి రాహుల్ కలిసి అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధి లో, మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా ఇటీవల మున్సిపాలిటీగా ప్రకటించబడిన అశ్వారావుపేట లో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రత్యక్షం గా పరిశీలించారు. రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ పట్టణ సుందరీకరణ పరిసరాల పరిశుభ్రత, తాగునీటి సరఫరా వంటి అంశాలపై స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు వారి అవసరాలను తెలుసుకున్నారు.
అధికారులతో చర్చిస్తూ పనుల నాణ్యత పై కచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని, ప్రజల అవసరాలకు తగిన విధంగా ప్రణాళికలు రూపొందించాలని సూచనలు చేశారు. అభివృద్ధి పనుల వేగం పెంచాలని మౌలిక సదుపాయాలు, అందుబాటు లో కి రావడమే లక్ష్యంగా, పనిచేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్, నాయకులు జూపల్లి రమేష్, తుంబ రాంబాబు, జూపల్లి ప్రమోద్,స్థానిక ప్రజాప్రతినిధులు వ్యాపారస్థులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Morning walk organized in

You cannot copy content of this page

Scroll to Top