త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలక్షేమ జిల్లా, మండపేట మండలం, ఏడిద గ్రామానికి చెందిన రాయుడు సత్తిబాబు, కుటుంబ సభ్యులను జనసేవాదళ్ సభ్యులు బుధవారం పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీ వేగుళ్ళ లీలాకృష్ణ, సూచనలు మేరకు కోరుమిల్లి జనసేవాదళ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 21,000/- రూపాయలు ఆర్థిక సాయాన్ని జనసేవాదళ్ సంస్థ సభ్యులు చేతుల మీదుగా బాధిత కుటుంబానికి అందజేశారు.
బాధితుడు అనారోగ్యంతో బాధపడుతూ విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో మండపేట పట్టణం, రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తున్న వారి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ సందర్భంగా ప్రతి నెల ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు జనసేవాదళ్ సంస్థకు విరాళాలు అందిస్తున్న దాతలు అందరికీ లీలాకృష్ణ, తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


