జూన్ 27, 2026
TRINETHRAM NEWS

మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి,శుభాకాంక్షలు తెలియజేసిన కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య,కార్యవర్గ సభ్యులు.

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 16 : కూకట్పల్లి జి.హెచ్.ఎం.సి మూసాపేట్ 23 సర్కిల్ డిప్యూటీ కమిషనర్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఇస్లావత్ నాయక్ ని వారి కార్యాలయంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకయ్య, కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందించి, శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డిసి ఇస్లావత్ నాయక్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనతోపాటు,నాణ్యమైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యమని,సజావుగా,పారదర్శకంగా జరిగేలా కృషి చేస్తానని అలాగే శుభాకాంక్షలు చెప్పిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ కోశాధికారి పుట్టి నగేష్,జాయింట్ సెక్రెటరీ నాగుల అంజిబాబు, సుజాత, సభ్యులు అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Newly appointed GHMC Moosapet

You cannot copy content of this page