Good Governance : ఆత్మీయ పలకరింపుతో సుపరిపాలన తొలి అడుగు

TRINETHRAM NEWS

తేదీ : 16/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ పట్టణం, ఆరు,ఏడు వార్డుల్లో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచారాన్ని ఎమ్మెల్యే వె నిగండ్ల రాము ఆత్మీయ పలకరింపులతో నిర్వహించారు. పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి , సంక్షేమ పథకాలు అమలలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా కులం, మతం, భాష, పార్టీ బేధం లేకుండా అర్హులైనటువంటి ప్రజలందరకు మేలు చేసే మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు.
ఏడాది కూటమి పాలన లో చేసిన అభివృద్ధి మరియు, అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు అందజేశారు. ప్రజలు తెలిపిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో ప్రసారం ఉత్సాహంగా సాగుతుందన్నారు. ఏ గ్రామం, వార్డుకి వెళ్లిన ప్రజల నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నడంతో ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది.

రాబోయే నాలుగేళ్లలో గుడివాడ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించమని , వాటి అమలు దిశగా ముందుకు సాగుతున్నామని, సందర్భంగా ఆయన పునరుద్గాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి. వెంకటేశ్వరరావు, గుడివాడ టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు, జగన్మోహన్రావు, కంచర్ల. సుధాకర్, పాలసీ ఉమా, ఇమాన్యుయల్ పునుకు మోహన్ మురళి, ఓలేటి .రమేష్, ఆదినారాయణ, రఫీ, ఆరు వ వార్డు టిడిపి నాయకులు విష్ణుమూర్తిల. ద్వారక, విశ్వనాధ్, నాగేశ్వరరావు, పి. రాజేశ్వరరావు, సంపంగి. మహేష్, గుత్తి .నారాయణ, కె.వి. ప్రసాద్, నీలవేణి, తేనెల. ఏడుకొండలు, వంగలేటి .మంగరాజు, చిన్నారావు, పిడుగు. శ్రీను, రామకృష్ణ, పి. రమణ, సచివాలయం సిబ్బంది , పట్టణ పరిధిలోని పలువురు నాయకులు , పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good governance first step

You cannot copy content of this page

Scroll to Top