92 దేవాలయాలకు మంజూరైన రూ.30,61,000/-రూపాయల చెక్కుల పంపిణీ

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 15 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా తెలంగాణరాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 92 దేవాలయాలకు గాను మంజూరైన రూ.30,61,000/ ముప్పై లక్షల అరవై ఒక వెయ్యి రూపాయలు మంజూరైన నిధులను చెక్కుల రూపేణ దేవాలయాల కమిటీ ప్రతినిధులకు ఈ ఓ సత్యనారాయణ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు,ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి పంపిణి చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ.ఈ సందర్భంగా గౌరవ పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా కన్నుల పండుగ వాతావరణం లో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవాలని, అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వాడవాడలో బోనాల జాతర వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకోవలనే ఉద్దేశ్యం తో నియోజకవర్గం లోని ప్రతి గుడికి బోనాల నిధులు మంజూరయేలా కృషి చేశానని ,బోనాలు అంగరంగ వైభవంగా జరుపుకునేల  బోనాలు నిర్వహించుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరుచేయడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని మతాల ప్రజలు అంగరంగా వైభవంగ పండుగలు జరుపుకునేల కృషి చేస్తున్నారు అని , పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేసారు.

తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు తీసుకెలుతున్నారని గాంధీ గారు.బోనాల సందర్భంగా ప్రతి గుడి వద్ద అన్ని రకాల మౌలిక వసతులు ఏర్పాటు చేసి కన్నుల పండుగ వాతావరణం లో బోనాలు జరిగేలా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండ అన్ని రకాల వసతులు కలిపిస్తూ ప్రశాంత వాతావరణం కలిపించామని, బోనాలు ఎంతో అంగరంగ వైభవంగా జరిగేలా చూడలని అధికారులకు గాంధీ తెలియచేసారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, దేవాలయాల కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of cheques worth

You cannot copy content of this page

Scroll to Top