QR Code Poster : కూటమి ప్రభుత్వం చేసిన మోసాలు ప్రతి గడపకు చేరవేయాలి

TRINETHRAM NEWS

•బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ క్యూ ఆర్ కోడ్ పోస్టర్ ఆవిష్కరించిన శాసన సభ్యులు, మరియు మండల నాయకులు!

త్రినేత్రం న్యూస్, ( చింతపల్లి) అల్లూరిజిల్లా, చింతపల్లి మండల నాయకులు నిర్వహించిన “బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ” మండల స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్యరాస విశ్వేశ్వర రాజు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో శాసన సభ్యులు *మత్స్యరాస విశ్వేశ్వర రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడిపిస్తున్నారు. ఏడాది కాలంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూటమి నాయకులు లబ్ధి పొందారు. తప్ప ప్రజలు ఎవ్వరు లబ్ధి పొందలేదని అన్నారు. సంక్షేమం సృష్టికర్త జగనన్న. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ఇచ్చిన,నేటికీ పల్లెల్లో ప్రతి ఒక్కరూ నోట విన్న అమ్మఒడి ఇచ్చరూ అంటున్నారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎవ్వరు మర్చిపోలేరు. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి నాడు, నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు రూపు రేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలలు మాదిరిగా తీర్చి దిద్ది మంచి విద్యని అందిస్తే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పాఠశాలలు తొలగించే కార్యక్రమం చేపడుతున్నారు.

కావున గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో హయాంలో ప్రజలకు ఏమీ చేసారు, ఏడాది కాలంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఏమీ చేసారు. అనే విషయం ప్రతి గడపకు తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమం మండల పరిధిలో ఉన్న జడ్పీటీసీ, ఎంపీపీ, మండల పార్టీ, అధ్యక్షులు అధ్వర్యంలో ప్రతి పంచాయతీ కేంద్రంలో సమావేశం నిర్వహించి చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసినా మోసాలు గ్రామాల్లో ప్రతి గడపకు చేరేలా కార్యక్రమలు చేపట్టాలని శాసన సభ్యులు మండల నాయకులకు నిర్దేశించారు.

_ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరాబు అనూష దేవి, జడ్పీటీసీ పోతురాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The frauds committed by

You cannot copy content of this page

Scroll to Top