జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. పెనుమూరు. గంగాధర్ నెల్లూరు మండలం నెల్లేపల్లి పంచాయతీ నెల్లేపల్లి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా జీడి నెల్లూరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వం విప్ డాక్టర్ వి ఎం థామస్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గు మల్ల ప్రసాద్ రావు, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మరియు కార్వేటినగరం మండల టిడిపి అధ్యక్షులు సోమశేఖర్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కార్యకర్తలు, ఎన్ డి ఏ కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In-charge Minister Ramprasad Reddy

You cannot copy content of this page