త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరం మండలం, వల్లూరు, అభివృద్ది, సంక్షేమం రెండు కళ్లు గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పరిపాలన సాగిస్తున్నారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గురువారం కపిలేశ్వరపురం మండలం, వల్లూరు, నిడసనమెట్ట, నేలటూరు గ్రామాలలో ఎమ్మెల్యే పాల్గొని ప్రజలకు కూటమి పాలన విజయాలు తెలపటంతో పాటు ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఇంటింటికీ తిరిగి ఒక సంవత్సర కాలంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది ఫలాలను వివరించారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళితే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదని తెలిపారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి అనిచెప్పి అరకొరగా అమలు చేశారని ఆక్షేపించారు. అన్నార్తుల ఆకలి తీర్చే అన్నా క్యాంటీలను గత ప్రభుత్వం పక్కన పెడితే కూటమి ప్రభుత్వం రాగానే అన్నా క్యాంటీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహించటం జరుగుతుందన్నారు. పెన్షన్ల పంపిణీలో ఇంటింటికీ ప్రతీ నెల మొదటి రోజే పంపిణీ చెయ్యడమే కాకుండా, వృద్దులకు, వికలాంగులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


