Former MLA Dr. Sathi : గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న, అనపర్తి మాజీ ఎమ్మెల్యే, డాక్టర్ సత్తి

TRINETHRAM NEWS

బలభద్రపురం ఆంధ్రా షిరిడీ సాయిబాబా మందిరంలో జరిగిన గురు పౌర్ణిమ వేడుకలలో పాల్గొన్న అనపర్తి మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు బిక్కవోలు

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలోని ఆంధ్రా షిరిడీ సాయిబాబా దేవాలయంలో గురు పౌర్ణిమ సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, మరియు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు పాల్గొన్నారు. వీరిని ఆలయ చైర్మన్ పురుషోత్తం రెడ్డి, కమిటీ సభ్యులు పడాల వెంకట్ రెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, సత్తి శ్రీనివాస రెడ్డి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.

తరువాత భగవంతుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరామారెడ్డి, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ నల్లమిల్లి వెంకట్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు సబ్బెళ్ళ సుజాత వీర్రాఘవరెడ్డి, మేడపాటి ఆనందరెడ్డి, వార్డు సభ్యులు కోనాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, పోసిరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి (ఫైనాన్స్ సత్తిబాబు), మామిడాల వీరబాబు (హై స్కూల్ కమిటీ మాజీ చైర్మన్), వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నాయకులు కొవ్వూరి వీర మోహన్ రెడ్డి, గుడిమెట్ల విశ్వనాథ్ రెడ్డి, తేతలి గవరయ్య, శ్రీను, ద్వారంపూడి వెంకట్ రెడ్డి (డి.వి.ఆర్.) తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former Anaparthi MLA Dr. Sathi

You cannot copy content of this page

Scroll to Top