వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : 12గంటల పని విధానం రద్దు చేసి 8గంటల పని విధానం అమలు చెయ్యాలి ఉద్యోగ కార్మిక సంఘాలు డిమాండ్. వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీ చౌరస్తా నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు ఉద్యోగ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించి అనంతరం ఆర్డిఓ కార్యాలయం ముందు ఆరు మహిపాల్ citu జిల్లా అధ్యక్షులు అధ్యక్షతన సభా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్ రాములు, బి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు భూముల కృష్ణయ్య, ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వై గీత, జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్ రెడ్డి లు మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని, పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం కార్మిక వర్గాన్ని బలిచ్చేందుకు తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నేడు దేశవాపిత పిలుపులో భాగంగా వికారాబాద్ లో భారీ ర్యాలీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది.
కార్మిక వర్గం సమరసిల పోరాటాల ద్వారా సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను, ముందుకు తీసుకువచ్చి పారిశ్రామిక సంబంధాల కోడ్ ట్రేడ్ యూనియన్ లో ఉద్యోగుల కార్మిక సంఘటితశక్తిని బలహీన పరుస్తున్నది లేబర్ కోడ్ ల ప్రకారం యాజమాన్యాలు సర్వీస్ కండిషన్లు మార్చాలనుకుంటే ముందస్తు నోటీస్ ద్వారా తెలియజేయవలసిన అవసరం లేదు పారిశ్రామిక సంబంధాల కోడ్ అమలు అయితే 300 మంది లోపు పనిచేసే పారిశ్రామిక సంస్థల్లో యాజమాన్యాలు ప్రభుత్వ అనుమతి లేకుండా యదేచ్చగా కార్మికుల్ని తొలగించుకోవచ్చ సమ్మె చేయడం సాధ్యం కాకుండా ఆంక్షలు విధిస్తున్నది సామాజిక భద్రత కోడ్ అమలు వల్ల ఉద్యోగులు పొందే ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుండి 10 శాతం తగ్గిస్తున్నది ఒక సంస్థ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈపీఎఫ్ నుండి మినహీంపు పొందేందుకు ప్రభుత్వానికి అధికారమిచ్చింది అంటే ఈ కోడ్ అమలు అయితే భవిష్యత్తులో ఈపీఎఫ్ సౌకర్యం తొలగించడమే కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసే స్కీమ్ వర్కర్ల అయిన అంగన్వాడీ ఆశ మద్దన భోజనం లేబర్ డిపార్ట్మెంట్ స్వయంగా నిర్వహిస్తున్న నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టులో పని చేస్తున్న టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందికి ఈపీఎఫ్ ఈఎస్ఐ
ఈ కోడ్లలో అనుమతించకపోవడం చాలా అన్యాయం యాజమాన్యాల ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల ప్రయోజనాల కోసమే ఈపీఎఫ్ను బలహీన పరుస్తున్నారు దశాబ్దాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హక్కులను భారత రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కార్మిక వర్గం పై ఉన్నది ప్రజల ఆస్తులను కార్పోరేట్లకు దోచిపెడుతూ మొత్తం చర్యల ద్వారా కార్మిక వర్గ రైతంగా వ్యవసాయ కూలీల ఐక్యతకు ఇచ్చినo చేసే చర్యలకు ప్రతిఘటించేందుకు, నేడు దేశవ్యాప్తంగా రాష్ట్రంలోని అన్ని కేంద్రాలలో నిరసనలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 12 విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించేందుకు పాటుపడాలని లేనిచో అన్ని వర్గాల ప్రజలను అన్ని రంగుల కార్మికులను ఏకం చేసి రాబోయే కాలంలో అన్ని పార్టీలు అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో citu బిఆర్టియు ఐఎఫ్టియు ఏఐటీయూసీ కార్మిక సంఘాలు,ఈ సమ్మెకు మద్దతుగా టి ఎస్ టి ఎఫ్ టీచర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటరత్నం కెవిపిఎస్ సామాజిక సంఘం జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి అనసూయ రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుదర్శన్, ఉద్యోగ కార్మికులు అంగన్వాడి ఆశ గ్రామపంచాయతీ మున్సిపల్ , VRA లు, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ యూనియన్ నాయకులు,ఎల్ఐసి ,ఎలక్ట్రిసిటీ, రైల్వే ,ఆటో ట్రాన్స్పోర్ట్ యూనియన్ రంగాల కార్మికులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


