జూలై 17, 2026
TRINETHRAM NEWS

పెద్దపల్లి, జూలై – 08: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పట్టణానికి చెందిన 30 సంవత్సరాల ఒక మహిళ గత కొంత కాలంగా గ్లాడ్ బ్లాడర్ నెక్ లో స్టోన్ ఉండడము వల్ల కరీంనగర్ లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిటై ఇ.ఆర్.సి.పి, స్టేటింగ్ చేయించుకుంది. ఈమె తీవ్రమైన గ్లాడ్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ పాక్రియస్ ఇన్ఫెక్షన్ లతో బాధ పడుతూ. మూడు రోజుల క్రితం డా. కె. శ్రీధర్ సంప్రదించగా, వెంటనే స్పందించి అవసరమైన రక్త పరీక్షలు, స్కానింగ్, 2డి ఎకో లాంటి పరీక్షలు నిర్వహించి పేషెంట్ ను అడ్మిట్ చేసుకున్నారు నేడు సదరు మహిళకు జిల్లా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో లాప్ సర్జన్ డా.

శ్రీకాంత్, జనరల్ సర్జరీ డా . సాయి ప్రసాద్, మత్తు వైద్యులు డా. కృష్ణవేణి, డా. స్వాతి విజయవంతంగా లాప్రో స్కోపిక్ సర్జరీ నిర్వహించారు అదేవిధంగా పెద్దపల్లి పట్టణానికి చెందిన 35 సంవత్సరాల ఒక మహిళ ఉదయం ఓ పి లో తీవ్రమైన కడుపు నొప్పితో రాగా వెంటనే స్కానింగ్ చేస్తే గర్భ సంచి పక్కకు వున్నా అండాశయము మెలిక పడి గ్యాగ్రినుగా మారడం జరిగింది. ఇదే మహిళకు కడుపులో ఒక్క లీటర్ వరకు రక్త స్రావము జరిగినది. వెంటనే స్పందిచిన వైద్యులు డా. స్రవంతి, గైనకలజిస్ట్, డా. సౌరయ్య, మత్తు వైద్యులు మరియు డా. కె. శ్రీధర్, మెడికల్ సూపరింటెండెంట్ సర్జరీ నిర్వహించి చెడిపోయున భాగాన్ని తొలగించడము జరిగింది. ఎమర్జెన్సీ లో స్పందించి ఈ సర్జరీ చేయడం వల్ల ఆ మహిళకు ప్రాణాపాయ ముప్పు తప్పింది జిల్లా ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు ప్రజలు ఉపయోగించు కోగలరని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లి చే జారీ చేయనైనది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Successfully Conducted Laproscopic Surgery

You cannot copy content of this page