CITU : రాష్ట్ర కార్మిక శాఖ విడుదల చేసిన జి.ఓ.నెంబర్ 282 ను ఉపసంహరించుకోవాలి.

TRINETHRAM NEWS

వేల్పుల కుమారస్వామి,సీఐటీయూ జిల్లా అధ్యక్షులు.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ కార్మికుల,ఉద్యోగుల పనిగంటలు పెంచుతూ జీ.ఓ.నెంబర్ 282 ను ఇవ్వడం జరిగింది.దీన్ని వ్యతిరేకిస్తూ సీఐటీయూ గోదావరిఖని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మెయిన్ చౌరస్తాలో జీ.ఓ.కాపీలు దగ్దం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి మాట్లాడుతూ కేంద్రంలో 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిన మోడీ ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి ముందే రాష్ట ప్రభుత్వం జీ.ఓ. విడుదల చేయడం చూస్తుంటే మోడీ విధానాలను తనకన్నా ముందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఒక ప్రక్క మోడీ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు దిగుతుంటే ఆ సమ్మెలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఉన్నప్పటికీ ఈ కరమైన జీ.ఓ.ను విడుదల చేయడం ఏంటని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రస్తుతం ఉన్న 8 గంటల పనిదిన్నాన్ని మార్చి 10 గంటలకు పెంచడం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మికులను, ఉద్యోగులను మోసం చేస్తోందని అన్నారు. ఇప్పటికైన కాంగ్రెస్ ప్రభుత్వం జీ.ఓ.నెంబర్ 282 ను ఉపసంహరించుకోవాలని లేదంటే ఆందోళనలు తప్పవని హెచ్చరించారు ఈకార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు నెర్వట్ల నర్సయ్య,నాయకులు కట్ల శివ కుమార్, బొజ్జ సతీష్,శ్రీనివాస్, రాజయ్య, సమీర్, గణేష్, పర్శరాములు, దీప, అంజలి,మంజుల,రమా తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The G.O. No. 282 issued by

You cannot copy content of this page

Scroll to Top