8 మందిని కరిచిన కుక్కలు.. శునకాలను బంధించిన సిబ్బంది
కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ జులై 3 : కూకట్ పల్లిలోని దీనబంధుకాలనీలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. కాలనీలోని గల్లీల్లో ఇస్టారీతిన సంచరిస్తూ స్థానికులను నోట కరచి గాయపరుస్తున్నాయి. గురువారం ఓ కుక్క మతిస్థిమితం కోల్పోయినట్టు ప్రవర్తించి వరుసగా ఎనిమిది మందిని కరవడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు కొందరిని కుక్కలు రక్తం వచ్చేలా కరవడంతో బస్తీవాసులు భయంతో బెంబేలెత్తిపోయారు. సమాచారం తెలుసుకున్న కాలనీ సొసైటీ అధ్యక్షులు ఎం.మహేందర్ నాయక్ హుటాహుటిన అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కుక్క కాటుకు గురైన పలువురిని ఆయన పరామర్శించారు.
విషయాన్ని కూకట్ పల్లి సర్కిల్ ఇంచార్జ్ వెటర్నరీ డాక్టర్ దీపాన్కర్ ను ఆయన ఫోన్ లో సంప్రదించి సమస్య తీవ్రతను డాక్టర్ కు వివరించారు. సిబ్బందిని పిలిపించి ఇస్టారీతిన సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న కుక్కలను శునకాలను బంధించారు.కుక్క కాటుకు గురైన వారు ఆందోళన చెందకుండా వెంటనే చికిత్స తీసుకోవాలని డాక్టర్ దీపాన్కర్ సూచించారు. అనవసరమైన భయాందోళనలను విడిచిపెట్టి సరైన చికిత్స తీసుకోవడం వల్ల ప్రమాదం ఉండదని చెప్పారు. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడంతోపాటు వైద్యుల సూచనలను పాటించి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని మహేందర్ నాయక్ కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


