కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి విజ్ఞప్తి చేసిన అధికారుల సంఘం
హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో పనిచేస్తున్న అధికారులకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో, సమానమైన, పెంచిన వేతనాలు చెల్లించాలని, అలాగే అధికారుల గ్రేడ్ లను, బొగ్గు గనులఅధికారులకు కూడా, వర్తింపచెయ్యాలని, గురువారం హైదరాబాదులోని కేంద్ర బొగ్గు గనుల శాఖ మాత్యులు, మాన్యులు కిషన్ రెడ్డి మరియు సతీష్ చంద్ర దూబే కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి అఖిల భారత బొగ్గు
గనుల అధికారుల సంఘం తరుపున వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా సింగరేణి లో పనిచేస్తున్న అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న అధికారులకు గల వ్యత్యాసాలను వివరించి సింగరేణి అధికారుల వేతనాల్లో జరుగుతున్న తేడాలను మంత్రికి వివరించారు ఈ కార్యక్రమంలో డి. సాహు జనరల్ సెక్రెటరీ (అపెక్స్)సీల్, లక్ష్మి పతి గౌడ్ సీసీల్ బ్రాంచ్ ప్రెసిడెంట్ , పొనుగోటి శ్రీనివాస్, బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్, కె. వెంకటేశ్వర్ రెడ్డి, ఏరియా ప్రసిడెంట్, హరిప్రసాద్ ఏరియా సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


